దిల్లీని కప్పేసిన పొగమంచు.. సున్నాకు పడిపోయిన విజిబిలిటీ

-

దేశ రాజధాని దిల్లీని మరోసారి పొగమంచు దట్టంగా కప్పేసింది. అయితే ఈసారి మునుపెన్నడూ లేనంతగా పొగమంచు అలుముకుంది. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉదయం 10 గంటల వరకు అసలు ఏం కనిపించలేదు. పలు ప్రాంతాల్లో విజిబిలిటీ సున్నాకు పడిపోయిందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పంజాబ్, హర్యానా, యూపీ, మధ్య ప్రదేశ్, ఛండీగఢ్ పరిసర ప్రాంతాల్లో పొగమంచు కారణంగా వస్తువులు కూడా కనిపించలేదు. మరోవైపు పొగమంచు కారణంగా దిల్లీలో 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అనేక విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

దిల్లీ ఐజీఐ విమానాశ్రయంలో విజిబిలిటీ 350 మీటర్లుగా నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పొగమంచు మధ్యే కర్తవ్యపథ్‌ వద్ద గణతంత్ర దినోత్సవ పరేడ్‌ రిహార్సల్స్‌ జరిగాయి. మరోవైపు తమిళనాడునూ పొగమంచు కమ్మేయడంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగ మంచుతో పాటు తీవ్రమైన చలిగాలులు వీస్తుండడంతో రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాదారులు నెమ్మదిగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరో 3 నుంచి 4 రోజులు దేశంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ అదికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version