ఉత్తరాదిన వరణుడి బీభత్సం.. అసోంలో 70 మంది మృతి

-

ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తూ వరదలు ముంచెత్తుతున్నాయి. అసోం, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బిహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్, రాజస్థాన్‌ సహా ఈశాన్య ప్రాంతాల్లో భారీ వానలతో నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుండటంతో రవాణా మార్గాలు స్తంభించి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది.

అస్సాంలో 24 లక్షల మందిపై వరదల ప్రభావం చూపుతోంది. బ్రహ్మపుత్ర నదితో సహా పలు ప్రధాన నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ధుబ్రి, కాచర్, దర్రాంగ్‌ వంటి జిల్లాల్లో అధికశాతం ప్రజలు నీటిలోనే తీవ్ర అవస్థలు పడుతున్నారు. తుపాను, వరదలు, కొండచరియలు విరిగిపడటం కారణంగా మృతి చెందినవారి సంఖ్య 70కి చేరుకుందని అధికారులు వెల్లడించారు. . కాజీరంగా జాతీయ పార్కులో వరదల కారణంగా ఇప్పటి వరకూ 129 జంతువులు చనిపోయినట్లు తెలిపారు.

మరోవైపు ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తడంతో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం రిషికేశ్‌లోని త్రివేణి ఘాట్, గంగా హారతి ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారింది. దీంతో రాత్రివేళల్లో ఘాట్‌ల వద్దకు పర్యాటకులెవరూ వెళ్లొద్దని రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన దళం హెచ్చరికలు జారీ చేసింది. గోవాలోని సత్తారి తాలూకాలో పాలి జలపాతానికి వెళ్లిన 80 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి 50 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరో 30 మంది అక్కడే చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news