కర్ణాటక హైకోర్టు ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. తను చేసిన అప్పులను కుమారుడు కచ్చితంగా తీర్చాల్సిందేనని తాజాగా కర్ణాటకకు హైకోర్టు తీర్పు చెప్పింది దినేష్ అనే వ్యక్తి తండ్రి భరమప్ప 2023లో ప్రసాద్ నుంచి రూ. 2.60 లక్షలు అప్పు తీసుకున్నాడు.
తండ్రి చనిపోవడంతో అప్పుకు, తనకు సంబంధం లేదని దినేష్ జవాబు ఇచ్చాడు. దీంతో ప్రసాద్ హైకోర్టుకు వెళ్లగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 29 ప్రకారం తండ్రి చనిపోతే, అప్పులు తీర్చాల్సిన బాధ్యత కుమారుడు పై ఉంటుందని తాజాగా కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. అతని కుమారుడు కచ్చితంగా అప్పు తీర్చాల్సిందేనని వెల్లడించింది.