భారత్-పాకిస్తాన్ పరిస్థులపై సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. మోడీని పాకిస్తాన్ పంపించాలా అంటూ మండిపడ్డారు. భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ను.. స్వాగతించారు సీపీఐ నారాయణ. భారత్-పాక్ మధ్య శాంతి చర్చలు జరగాలి అన్నందుకు ఒకప్పుడు నన్ను పాకిస్తాన్ పంపాలని అవాక్కులు చవాకులు పేలారని ఆగ్రహించారు.

మరి ఇప్పుడు ప్రధాని మోడీని పాకిస్తాన్ పంపించాలా..? పీఓకేను ఎందుకు ఆక్రమించకుండా కాల్పుల విరమణకు ఎందుకొచ్చారు..? అని నిలదీశారు సీపీఐ నారాయణ. పాకిస్థాన్ కు చైనా సహాయం చేస్తుందనేది కేవలం అపోహ మాత్రమే అని బాంబు పేల్చారు. గతంలో మాట్లాడిన నావ్యాఖ్యలను అపార్దం చేసుకొని నన్ను పాకిస్థాన్ ఏజెంట్ అని అంటున్నారన్నారు.
భార్య కల్లముందు కాల్లపారాణి ఆరకముందే కట్టుకున్న భర్తలను చంపిన ఉగ్రవాదులపై ఇండియన్ ఆర్మి ధాడులు చేయడాన్ని నేను తప్పు పట్టలేదని వెల్లడించారు. సామాన్య ప్రజలపై దాడులు చేయడాన్నిమాత్రమే నేను తప్పుపట్టానన్నారు సీపీఐ నారాయణ.