hijab row: హిబాబ్ పై సుప్రీంను ఆశ్రయించిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్

-

హిబాబ్ వివాదంపై సుప్రీం కోర్ట్ లో మరో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే హిజాబ్ పై కర్ణాకట హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్ట్ లో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్‌బీ) అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధానికి వ్యతిరేఖంగా దాఖలైన పటిషన్లను కొట్టివేసిన కర్ణాటక హైకోర్ట్ ఉత్తర్వులపై సుప్రీంలో ఛాలెంజ్ చేశారు. 

దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన కర్ణాటకలోని హిబాబ్ అంశంపై ఇటీవల కర్ణాటక హైకోర్ట్ తీర్పు చెప్పింది. జస్టిస్ అవస్థి నేత్రుత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. ఇస్లాంలో హిబాబ్ తప్పనిసరి సంప్రదాయం కాదని తీర్పు చెప్పింది. విద్యాలయాల్లో హిబాబ్ ను వ్యతిరేఖించింది. విద్యా సంస్థల్లో హిబాబ్ బ్యాన్ ను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇప్పటికే పలువురు సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. అయితే హిబాబ్ పై అత్యవసర విచారణకు సుప్రీం కోర్ట్ నో చెప్పింది. తాజాగా మరోసారి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మరోసారి సుప్రీంను ఆశ్రయించింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version