భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు వాక్ చాతుర్యం గురించి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు.. దేశ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసే పద ప్రయోగాలు, చమత్కారాలు చాలా స్పాంటేనియస్గా ఉంటాయి. తాజాగా ఇటువంటి చమత్కారం ఒకటి మలయాళ నటుడు, బీజేపీ రాజ్య సభ సభ్యుడు సురేశ్ గోపిపైన వెంకయ్య చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాజ్యసభ చైర్మన్ హోదాలో వెంకయ్య నాయుడు చేసిన స్పాంటేనియస్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.
నటుడు, రాజ్య సభ సభ్యుడు అయిన సురేశ్ గోపి తాను మాట్లాడిన టైం వచ్చినపుడు మాట్లాడే క్రమంలో తొలుత చైర్మన్కు థాంక్స్ చెప్పబోయాడు. ఇంతలోనే వెంకయ్య జోక్యం చేసుకుని మీరు ధరించినది మాస్కా ..? లేదా గడ్డమేనా? అని సురేశ్ గోపిని ఉద్దేశించి నవ్వుతూ అడిగాడు. అంతే సభలోని సభ్యులు నవ్వేశారు. ఈ క్రమంలోనే సురేశ్ గోపి బదులిచ్చాడు. తనది ఒరిజినల్ గడ్డమేనని తెలిపాడు. తాను చేయబోయే నెక్స్ట్ ఫిల్మ్ కోసం అది తన న్యూ లుక్ అని పేర్కొన్నాడు.
ఇక ఈ వీడియోను సినీ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలా అది నెట్టింట ట్రెండవుతోంది. సురేశ్ గోపి ఇటీవల ‘పాప్పన్’ చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన తన నెక్స్ట్ ఫిల్మ్ ‘ఎస్ జి 251’ కోసం ఇలా డిఫరెంట్ స్టైల్ లో గడ్డం పెంచుతున్నాడని మాలీవుడ్ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇకపోతే ఈయన తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల చిత్రాల్లోనూ నటించారు. తెలుగులో ‘అంతిమ తీర్పు, ఆ ఒక్కడు’ సినిమాల్లో నటించాడు.
HAHAHA! Our VP @MVenkaiahNaidu Garu and his wicked sense of humour! Never a dull moment with him around! Suresh Gopi this time!
Yappa! 😂 #CannotAbleTo #EpicLol pic.twitter.com/WfhZ6NIsYb
— मङ्गलम् (@veejaysai) March 25, 2022