మోడీ పుట్టుకతోనే బీసీ కాదు కాబట్టే ఆ విషయం తెలియదు.. సీఎం వ్యాఖ్యలను సమర్థించిన ఎంపీ

-

తెలంగాణ బీజేపీ  నాయకులపై కాంగ్రెస్ కీలక నేత, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ  పుట్టుకతో బీసీ కాదని మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.. అందులో తప్పేముంది.. ఆయన నిజంగానే కన్వెర్టెడ్ బీసీ అని అన్నారు. అందులో ఎక్కడా ప్రధానిని అవమానపరిచినట్లు లేదని తెలిపారు. మోడీ పుట్టుకతో బీసీ
కాకపోవడం వల్ల బీసీల అణచివేత, అవమానాలు ఆయనకు తెలియదని చెప్పారు. అదే విషయాన్ని
రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.. అందులో ఎలాంటి రాజకీయ విషయాలు లేవు. రేవంత్ రెడ్డి కి బీసీల సమస్యలు బాగా తెలుసు కాబట్టే ఆయన ముఖ్యమంత్రి కాగానే బీసీ కులగణన చేసి వారి జనాభా లెక్కల ప్రకారం.. వారికి విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో వాటా కోసం కృషి చేస్తున్నారని మల్లు రవి అన్నారు.

నరేంద్ర మోడీ గనుక ముందు నుంచి బీసీ అయ్యుంటే.. బీసీలపై ప్రేమ ఉంటే.. కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మన దేశంలో ఎవరూ దైవాంశసంభూతులు లేరని.. ఇది ప్రజాస్వామ్య దేశం ఇక్కడ ప్రజల మద్దతు ఉన్నవారే నాయకులు అవుతారని అన్నారు. పదే పదే బీసీని అని చెప్పుకుంటున్న మోడీ.. బీసీలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా మోడీ బీసీ అయితే ఇక్కడున్న బీజేపీ నాయకులు మోడీని ఒప్పించి బీసీ కులగణన చేసి న్యాయం చేయాలని
డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news