హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనండి: ప్రముఖ స్వామీజీ సంచలనం

-

భారత్ ఇస్లామిక్ దేశంగా మారకుండా ఉండేందుకు హిందువులు మరింత మంది పిల్లల్ని కనాలంటూ వివాదాస్పద స్వామీజీ యతి నర్సింగానంద్ ఆధ్వర్యంలోని సంస్థ మరోసారి హిమాచల్ ప్రదేశ్ లో పిలుపునిచ్చింది.రానున్న దశాబ్దాల్లో భారత్ హిందువులు తక్కువగా ఉన్న దేశంగా మారకుండా ఉండాలంటే, హిందువులు మరింత మంది పిల్లల్ని కనాలని ఈనెల మొదట్లో నే యేతి నర్సింగానంధ్ ఉత్తరప్రదేశ్ లోని మధుర వేదికగా పిలుపునిచ్చారు.2021 డిసెంబర్ 17-19 తేదీల మధ్య హరిద్వార్లో ధర్మ సంసద్ నిర్వహించి, రెచ్చగొట్టే ప్రసంగం చేశారంటూ ఆయనపై లోగడ కేసు నమోదైంది.ఈ కేసులో నే నర్సింగానంద్ అరెస్టు అయి, బెయిల్ పై విడుదలయ్యారు.

తాజాగా అఖిల భారతీయ సంత్ పరిషత్ హిమాచల్ ప్రదేశ్ ఇంచార్జి యతి సత్య దేవానంద్ సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు . “భారత్ ప్రజాస్వామ్య దేశం ఇక్కడ హిందువులుు మెజారిటీ గా ఉన్నారు కానీ ముస్లింలు ఒక ప్రణాళిక ప్రకారం ఎక్కువమందిని కంటూ తమ సంతతి పెంచుకుంటున్నారు.ముస్లింలు మెజారిటీ సాధిస్తే పాకిస్తాన్ మాదిరే భారత్ ఇస్లామిక్ దేశంగా మారుతుంది.దీనిని నివారించేందుకు హిందువులు మరింత మంది పిల్లల్ని కనాలి అని తమ సంస్థ కోరుతుంది” అన్నారు యతి సరస్వతి.దీనిపై స్థానిక పోలీసులు తీవ్రంగా స్పందించారు.ఉనా జిల్లా అంబ్ పోలీస్ స్టేషన్ అధికారులు సెక్షన్ 24 కింద నోటీసుఅధికారులు సెక్షన్ 24 కింద నోటీసు జారీ చేశారు.ఏ మతం, కులాన్ని రెచ్చగొట్టేలా ప్రసంగించే వద్దని కోరారు.ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version