పసిడి ప్రియులకు శుభవార్త.. ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

-

దసరా పండుగ రోజు బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం పసిడి ధరకు బ్రేక్ పడింది. అక్టోబర్ 23న 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,750 గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,900గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,850 గా నమోదు అయింది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,600గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,750 గా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. దేశీయ మార్కెట్ లో కిలో వెండి ధర ఇవాళ రూ.75,300గా ఉంది నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండిలో ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ.75,300గా ఉంది. చెన్నైలో 78,700, బెంగళూరులో 74,500, హైదరాబాద్ లో 78,700గా ఉంది. ఇక విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.78,700 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news