పోర్నోగ్రఫీకి ఎరోటికాకి మధ్య తేడా ఏమిటి..?

-

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తను పోర్న్ గ్రాఫిక్ కంటెంట్ మొబైల్ యాప్ ద్వారా అప్ లోడ్ చేస్తున్నందుకు అరెస్ట్ అయ్యాడు. అయితే రాజ్ కుంద్రా లాయర్ సుభాష్ యాదవ్ పోర్న్ అంటే సెక్సువల్ ఇంటర్ కోర్స్ చూపించడం అని మిగిలినవన్నీ కూడా వల్గర్ కంటెంట్ లెక్కకి వస్తాయి అని అన్నారు.

అయితే అసలు పోర్నోగ్రఫీ అంటే ఏంటి ఎరోటికా అంటే ఏమిటి..?

పోర్నోగ్రఫీ లో సెక్సువల్ యాక్షన్ చూపిస్తారు. దీనితో చూసిన వాళ్ళకి సెక్స్ పై కోరిక కలుగుతుంది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం పోర్నోగ్రఫీ అంటే వివరించడం లేదా బట్టలు లేకుండా వున్న వాళ్ళని చూపించడం మరియు సెక్సువల్ యాక్ట్స్ చూపించడం. దీనితో వీక్షకులకు సెక్స్ పైన కోరిక పుడుతుంది.

ఎరోటికా అంటే ఏమిటి..?

ఎరోటికా పోర్న్ లాగ కాదు. ఎరొటిక అనేది ఒక ఆర్ట్ వర్క్. దీనిలో సెక్స్ కి సంబంధించి సబ్జెక్టు ఉంటుంది. దీనిలో పెయింటింగ్స్, ఫోటోగ్రఫీ, డ్రామా ఫిలిం, మ్యూజిక్ మొదలైనవి ఉంటాయి.

భారతదేశంలో పోర్న్ కి ఏ చట్టాలు వ్యవహరిస్తాయి?

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టం 2000, ఇండియన్ పీనల్ కోడ్ మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం 2012 సాధారణంగా వ్యవహరిస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news