మన పక్క దేశం అయిన శ్రీలంకలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభంతో.. శ్రీలంక ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. శ్రీలంకలో దారుణంగా పరిస్థితి మారింది. పెట్రోలు బంకుల వద్ద అయితే.. లంకా వాసులు ఘర్షణకు దిగుతున్నారు. పెట్రోల్, డీజల్ కోసం ఒకరిని ఒకరు క్యాన్ లతో కొట్టుకుంటున్నారు లంకా వాసులు.
మరో మూడు రోజులు పెట్రోలు, డిజల్ దేశంలో ఉండదని.. శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. కొనుగోలు చేయడానికి మరో రెండు రోజుల పడుతుందని శ్రీలంక సర్కార్ చెబుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే… బ్లాక్ లో 1200 నుండి 1500 పెట్రోలు, డిజల్ అమ్ముతున్నారు.
కరెంట్ కోతల నేపధ్యంలో హోటల్స్…ప్రైవేటు హాస్పటల్స్ తప్పసరి పరిస్థితులలో కొనుగోలు చేసుకుంటున్నారు. కాగా.. ఇటీవలే.. ఆ దేశ అధ్యక్షుడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే రాజపక్సే రాజీనామా చేశారు.