BREAKING : లండన్‌లో హైదరాబాద్‌ వాసి హత్య

-

ఉపాధి నిమిత్తం లండన్ వెళ్లాడు ఓ వ్యక్తి. అక్కడ రేయింబవళ్లు కష్టపడ్డాడు. సరిగ్గా తిండీతిప్పలు లేకున్నా కుటుంబం కోసం నగదు కూటబెట్టేందుకు ప్రయత్నించాడు. ఎట్టకేలకు కుమార్తె పెళ్లి కోసం కొంత సంపాదించాడు. ఇక ఆమె పెళ్లి కోసం త్వరలోనే హైదరాబాద్​కు రాబోతున్నానని తెగ సంతోషపడ్డాడు. చాలా ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలుసుకోబోతున్నానని ఎంతో సంబురపడ్డాడు. కానీ అంతలోనే మృత్యువు అతణ్ని వెంటాడింది. అసలేం జరిగిందంటే..?

ఉపాధి నిమిత్తం లండన్ వెళ్లిన హైదరాబాద్ వ్యక్తి రైసుద్దీన్‌ హత్యకు గురయ్యారు. తన మిత్రుడితో కలిసి బయటకు వెళ్తుండగా దుండగులు దాడి చేసి.. అతణ్ని హతమార్చి.. అతడి వద్ద ఉన్న నగదుతో పాటు వస్తువులు దోచుకెళ్లారు. కుమార్తె పెళ్లి కోసం హైదరాబాద్‌కు వచ్చే సమయంలో హత్యకు గురవ్వడంతో ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో మునిగింది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న కుటుంబం ఈ విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. రైసుద్దీన్ మృతదేహాన్ని భారత్​కు రప్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని ఆ కుటుంబం కోరుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version