ఓఎల్ఎక్స్ నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు చేసిన సాహసం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. కార్తీ నటించిన ఖాకీ సినిమాలో పోలీసులు దోపిడీ దొంగలను పట్టుకునేందుకు చేసిన లాంటి సాహసాన్నే చేశారు. రాజస్థాన్ లోని భరత్ పూర్ వెళ్ళిన సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు పై అక్కడి నిందితులు దాడులు చేశారు. పోలీసుల వేసుకు వెళ్ళిన వాహనాలను ధ్వంసం చేసిన సైబర్ నేరగాళ్లు, అర్ధరాత్రి భరత్ పూర్ లో పోలీసులను కొట్టడానికి కూడా యత్నించారు. అయితే పోలీసుల ఎదురు దాడితో సైబర్ నేరగాళ్లు పారిపోయారు.
దీంతో వాళ్ళ వెంట పడిన పోలీసులు పది మందిని పట్టుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఓఎల్ఎక్స్ లో వాహనాల ఫోటోలు పెట్టి తక్కువ ధరకే అమ్ముతామంటూ ఈ ముఠా మోసం చేసింది. రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లా కళ్యాణి పూరి చౌ వేరా గ్రామాల్లో ఉన్న నిందితులను అర్ధరాత్రి ఇళ్ల పై దాడులు చేసి అరెస్ట్ చేశారు. భరత్ పూర్ జిల్లా కు చెందిన వంద మంది పోలీసులు హైదరాబాదు నుండి వెళ్లిన 10 సైబర్ క్రైమ్ పోలీసులపై నిందితులు, గ్రామస్థులు దాడులకు పాల్పడ్డారు.