ఒంటిరి ప్రయాణం ఎక్స్‌పెరియెన్స్ మర్చిపోలేని అనుభూతి అంటున్న పూరి జగన్నాధ్..!

-

ప్రపంచమే ఒక్క పెద్ద పుస్తకం లాంటిది, మనం చదవాల్సింది ఎంతో ఉంది. మీరు ఊళ్లోనే పుట్టి అక్కడే ఉండి, చస్తే మీరు ఒక్క పేజీ మాత్రమే చదివి తెలుసుకునట్టు. మన జీవిత కాలంలో వీలైనన్ని పేజీలు తిరగేయండి, చదవండి ” అని అంటున్నారు ఫేమస్ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్. పూరీ తన మ్యూజిక్ లో భాగంగా ట్రావెలింగ్‌ అనే అంశంపై మాట్లాడుతూ ట్రావెలింగ్‌ చేయడం అనేది గొప్ప అనుభూతి. ట్రావెలింగ్‌ వల్ల అనేక విషయాలు తెలుస్తాయి. ట్రావెలింగ్‌ అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకొచ్చారు పూరి. మీరేం చేస్తున్నారని తనని అడిగితే తానొక ట్రావెలర్‌ అని చెప్పాలని ఇష్టపడతాను అని చెప్పారు ఆయన. తాను కూడా కొలంబస్‌, వాస్కోడిగామా, హుయాన్‌త్సాంగ్‌ లాగా వరల్డ్‌ ఎక్స్‌ప్లోర్‌ చెయ్యాలనుకొంటున్నటు చెప్పారు.

తనకు అన్నీ దేశాలు తిరిగి రావాలని, కానీ సంసారం అనే సాగరంలో ఇరుక్కున్నా కాబట్టి కుదరటం లేదని చెప్పారు. అయినా పర్లేదు తనకి వీలైనంత వరుకు తిరుగుతానని, ప్రతి ఏడాది ఏదో ఒక దేశానికి వెళ్లి వస్తాను. అది తనకు భలే కిక్కునిస్తుందని, అందరు అలాంటి అనుభూతి చెందాలని చెప్పుకొచ్చారు పూరి. గ్రూపుతో కలిసి వెళ్లి గైడు చెప్పేవి చూస్తూ తిరిగితే టూరిస్ట్‌ అంటారు. అలాకాకుండా మనం సపరేట్ గా వెళ్ళితే ట్రావెలర్స్‌ అంటారు. ఇవే కాకుండా ఎక్స్‌ప్లోరర్స్‌ అని కూడా ఉంటారు.

ఎక్స్‌ప్లోరర్‌ కి చాలా ధైర్యముండాలి, ఒంటరిగా ట్రావెల్ చేయగలగాలి. నేను అనేక మంది ఎక్స్‌ప్లోరర్స్ ‌ను కలిసి మాట్లాడాను. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా స్పెయిన్‌ నుండి కేవలం వెహికల్స్‌ను లిఫ్ట్‌ అడిగి 12దేశాలు దాటి ఇండియా వచ్చిన ఓ జంట కూడా తనకు తెలుసు అంట. లండన్‌ నుండి హిమాచల్‌ కొండల్లో మైనస్‌ డిగ్రీల చలిలో నెలల తరబడి కేవలం స్లీపింగ్‌ బ్యాగులో పడుకుని ఉండే డేవిడ్ అనే వ్యక్తి ‌ తనకు తెలుసని, హిమాలయ పర్వతం ఎక్కి నిలబడ్డ ఇరవైయేళ్ల కుర్రాడు కూడా తనకు తెలుసు అని చెప్పారు. చాలా తక్కువ ఖర్చుతో మనం ఎలా ట్రావెల్‌ చేయాలో ఒక్క సారి గూగుల్‌లో వెతికి చూడండి. వీలైతే ఒంటిరిగా ట్రావెల్‌ చెయ్యమని, ఎలాంటి ప్లాన్‌ లేకుండా చేసే ప్రయాణం ఓ ఎక్స్‌పెరియెన్స్ మర్చిపోలేని అనుభూతి ఇస్తుందని ‌” పూరీ వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version