షాకింగ్ : ఒక్క రోజే 19 మంది మృతి…!

-

ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకి కరోనా కేసులతో గుజరాత్ అల్లాడిపోతుంది. గుజరాత్ లో కీలక నగరం గా ఉన్న అహ్మదాబాద్ లో ఆదివారం 19 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ లో అహ్మదాబాద్ పెద్ద నగరం… ఇక్కడ ఇప్పటి వరకు 105 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ముంబై తర్వాత ఇక్కడే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు.

ముంబై లో 204 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో కేంద్రం పంపిస్తున్న టీంలు అహ్మదాబాద్ లో కూడా పర్యటించి పరిస్థితిని అంచనా వేయనున్నాయి. మృతుల్లో ఎనిమిది మంది ఇతర తీవ్రమైన అనారోగ్యాలు లేని 34-59 సంవత్సరాల వయస్సు ఉన్న కరోనా రోగులు మరణించారని అధికారులు పేర్కొన్నారు. మరో తొమ్మిది మంది అధిక రక్తపోటు, డయాబెటిస్ మరియు గుండె జబ్బులతో బాధపడుతున్నారు.

కాంగ్రెస్ కార్పొరేటర్ బద్రుద్దీన్ షేక్ (67) నగరంలోని హాట్‌స్పాట్ అయిన బెహ్రాంపూరా వార్డుకు ప్రాతినిధ్యం వహించారు. షేక్ ఏప్రిల్ 15 న పాజిటివ్ రాగా ఆయనను సర్దార్ వల్లభాయ్ పటేల్ (ఎస్వీపీ) ఆసుపత్రిలో జాయిన్ చేసారు. వారం పాటు ఆయనకు వెంటిలేటర్ సహాయంతో సహాయం తో చికిత్స చేసారు. ఇక సూరత్ లో కూడా అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా హాట్ స్పాట్ గా ఉంది ఆ ప్రాంతం.

Read more RELATED
Recommended to you

Latest news