ఇండియా వర్సెస్ పాకిస్త మధ్య యుద్ధం మొదలైంది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యలో భారత్.. పాక్‌లోని బహావల్‌పూర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులకు దిగింది. ఈ దాడిలో 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఈ దాడుల నేపథ్యంలో పాక్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు.