ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆపరేషన్ సింధూర్ ను… పాకిస్థాన్ ను అంతం చేసేందుకు ఇండియన్ ఆర్మీ ప్రారంభించేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్ర శిబిరాలపై భారత దళాలు ఒక్కసారిగా దాడులు మొదలుపెట్టాయి.

పిఓకే లో ఉగ్ర స్థావరాలపై… భారత సైన్యం మెరుపు దాడులు చేస్తోంది. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆర్మీ దాడులు జరుగుతున్నాయి. అర్ధరాత్రి 1.44 గంటలకు పాకిస్తాన్ పై యుద్ధం ప్రారంభించినట్లు ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటన చేసింది.
అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో… పాకిస్తాన్ చుక్కలు చూస్తోంది. ఇప్పటివరకు జరిగిన దాడులలో మొత్తం 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం అందుతుంది. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు సమాచారం అందుతుంది.