ఆయుధాల అక్రమ రవాణాపై ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ఆందోళన

-

ఉగ్రవాదులకు ఆయుధాల అక్రమ రవాణపై ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. తేలికపాటి ఆయుధాలు, మందుగుండు సామగ్రి అక్రమ మార్గాల్లో ఉగ్ర వాదులకు చేరుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసిన భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ .. ఆయుధ అక్రమ రవాణపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాలని కోరారు. ఆయుధ కొనుగోలును పరిమితం చేసేలా దేశాల మధ్య సమన్వయం అవసరమని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో ఆమె తెలిపారు.

“తీవ్రవాదులు, వారికి మద్దతు తెలిపే వారికి . ఆయుధాలు అందకుండా చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి. స్వల్ప లక్ష్యాలను ఛేదించే అవకాశం ఉన్న ఆయుధాలతోనే చాలా ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. సీమాంతర ఉగ్రవాదం, అక్రమ ఆయుధాలతో ముష్కరులు సాగిస్తున్న హింసతో భారత్‌ చాలా నష్టపోయింది. అనేక దశాబ్దాలుగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ పోరాడుతోంది. తాజాగా డ్రోన్‌లతోనూ ఆయుధాలు చేరవేస్తూ హింసను ప్రేరేపిస్తున్నారు. వీటన్నింటికీ చరమ గీతం పాడాలి.” అని ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో భారత శాశ్వత ప్రతిని రుచిరా కాంబోజ్ పిలుపునిచ్చారు

Read more RELATED
Recommended to you

Exit mobile version