12 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు భారత్ ఆహ్వానం..!

-

12 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు భారత్ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. గోవా వేదికగా త్వరలో జరగబోయే షాంఘై సహకార సంస్థ- ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం.. దాయాదికి ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఉగ్రవాదం, కశ్మీర్‌ అంశాలపై భారత్, పాకిస్థాన్‌ మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్‌. జైశంకర్ పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టోకు అధికారికంగా ఆహ్వానం పంపినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ సదస్సులో పాల్గొనేందుకు భారత్‌.. ఇటీవల ఎస్‌సీఓ సభ్య దేశాలకు ఆహ్వానాలు పంపింది. చైనా, రష్యా, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, తజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ వంటి దేశాలతో పాటు పాకిస్థాన్‌కు కూడా ఈ ఆహ్వానం పంపినట్లు సదరు కథనాలు తెలిపాయి. దీనిపై పాక్‌ నుంచి ఇంతవరకూ స్పందన రాలేదు. ఒకవేళ, ఈ ఆహ్వానాన్ని దాయాది అంగీకరిస్తే.. పాక్‌ విదేశాంగ మంత్రి భారత్‌కు రావడం 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version