రక్షణ వ్యయంలో నాలుగో స్థానంలో భారత్‌.. నం.1గా అమెరికా

-

ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలవగా.. చైనా, రష్యా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. స్టాక్‌హోం అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రం (సిప్రి) తాజాగా ఈ మేరకు నివేదిక విడుదల చేసింది.  ఈ నివేదిక ప్రకారం 2023లో భారత్ రక్షణ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. మరోవైపు అమెరికా 91,600 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం 2,44,300 కోట్ల డాలర్లుగా ఉందని అందులో తెలిపింది. 2022తో పోలిస్తే ఆ మొత్తం 6.8% అధికమని పేర్కొంది.

భారత రక్షణ వ్యయం 2022తో పోలిస్తే 2023లో 4.2% పెరిగిందని సిప్రి నివేదిక వెల్లడించింది. సిబ్బంది, నిర్వహణ వ్యయాల పెరుగుదలే భారత రక్షణ వ్యయం అధికమవుతుండటానికి ప్రధాన కారణమని పేర్కొంది. 2023 నాటి మొత్తం మిలిటరీ బడ్జెట్‌లో వాటిదే మూడొంతులకు పైగా వాటా అని తెలిపింది. మిలిటరీ వ్యయంలో దాదాపు 22% బడ్జెట్‌ను రక్షణ రంగ కొనుగోళ్ల కోసం కేటాయిస్తోందని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news