బలూచిస్థాన్‌లోని మిలిటెంట్ల స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. బలూచీ మిలిటెంట్లు తమ భద్రతా బలగాలపై దాడి చేశారని దానికి ప్రతీకార చర్యగానే తాజాగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేశామని ఇరాన్ సమర్థించుకున్నట్లు సమాచారం. అయితే పాక్పై ఇరాన్ దాడులను భారత్ పరోక్షంగా సమర్థించింది.
ఓవైపు ఇది పూర్తిగా ఇరాన్, పాక్ అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానిస్తూనే మరోవైపు ఆత్మరక్షణలో భాగంగా కొన్ని దేశాలు తీసుకునే చర్యలను అర్థం చేసుకోగలమని పేర్కొంది. ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోదని ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శి రణ్‌ధీర్ జైస్వాల్ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో ఎప్పటికీ రాజీ పడబోమని స్పష్టం చేశారు.
ఇదీ జరిగింది.. బలూచిస్థాన్‌లోని ‘జైష్ అల్ అదిల్’ మిలిటెంటు గ్రూపునకు చెందిన రెండు స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది. అయితే దీన్ని తీవ్రంగా పరిగణించిన పాకిస్థాన్ తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నిరసనగా ఇరాన్ దౌత్యవేత్తకు పాకిస్థాన్ సమన్లు జారీ చేసింది.