IND vs AUS: భారత్ వర్సెస్ ఆసీస్ చివరి పోరు

-

ఇవాళ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య చిట్టచివరి t20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా ఇవాళ సాయంత్రం ప్రారంభమవుతుంది. ఎప్పటిలాగే సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా చివరి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా.

India vs Australia, 5th T20I

ఇవాళ చివరి మ్యాచ్ కూడా గెలిచి ఆస్ట్రేలియాపై ప్రతికాలం తీసుకోవాలని టీమ్ ఇండియా చూస్తోంది. అయితే ఇవాల్టి మ్యాచ్ కు భారీ వర్ష సూచన ఉన్నట్లు సమాచారం అందుతోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు అలాగే మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కూడా వర్షం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకవేళ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారీ వర్షం కురిస్తే… మ్యాచ్ రద్దు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మ్యాచ్ మధ్యలో వర్షం పడి ఆగిపోతే డక్వర్తు లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version