పాకిస్థాన్ కు చుక్కలు చూపించింది ఇండియన్ ఆర్మీ. దీనికి సంబందిచిన మరో వీడియో రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. మే 7న పాక్ చేసిన మిస్సైల్ దాడికి ఇండియన్ ఆర్మీ ఎలా బుద్ధి చెప్పిందో వీడియోలో వివరణ ఇచ్చింది. పాక్ మిస్సైల్స్, డ్రోన్లు, UAVCలను మన రక్షణ వ్యవస్థ ఎలా నిర్వీర్యం చేసింది.

ఉగ్ర స్థావరాలు, పాక్ ఎయిర్ బేస్‌లను మిస్సైల్స్ ఎలా ధ్వంసం చేశాయనే అంశాలపై వీడియో విడుదల చేసింది. కాగా, లష్కరే తోయిబా ప్రధాన ఉగ్రవాది పాకిస్థాన్‌లో హతం అయ్యాడు. భారత్‌లోని నాగ్‌పూర్, రాంపూర్, బెంగళూరులో దాడులకు అతడే సూత్రధారి. ఆపరేషన్ సిందూర్ అనంతరం సైఫుల్లాకి భద్రత కల్పించింది పాక్ ప్రభుత్వం. పాక్‌లోని సింధ్ రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో సైఫుల్లా మృతి చెందినట్టు సమాచారం.
పాక్ మిస్సైల్స్‌ను కూల్చిన వీడియో పోస్టు చేసిన ఇండియన్ ఆర్మీpic.twitter.com/jaATgJb0u7
— ChotaNews App (@ChotaNewsApp) May 19, 2025