ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉన్న హిజ్రాలకు గుడ్ న్యూస్ చెబుతూ… కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ట్రాన్స్ జెండర్లకు కూడా రేషన్ కార్డులు జారీ చేసేందుకు.. నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంస్థ చైర్మన్ తోట సుధీర్ ప్రకటన చేశారు. కాకినాడలో నిన్న జనసేన పార్టీ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ… రేషన్ కార్డుల విషయాన్ని వివరించారు. ఆల్ ద బెస్ట్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం… కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులు అందించి… వారికి న్యాయం చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా వాళ్లకు సన్మానం కూడా చేశారు.