క్రికెట్ సర్ఫరాజ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా లో స్థానం సంపాదించుకునేందుకు గత కొన్ని నెలలుగా కష్టపడుతున్నాడు క్రికెట్ సర్ఫరాజ్ ఖాన్. ఇలాంటి నేపథ్యంలోనే.. క్రికెట్ సర్ఫరాజ్ ఖాన్ ఓ ఇంటి వాడయ్యారు.
జమ్మూ కాశ్మీర్ లోని షోపియన్ జిల్లాకు చెందిన యువతితో కలిసి ఏడు అడుగులు నడిచారు. వీరి వివాహం కాశ్మీర్ లో అతి కొద్ది మంది బంధుమిత్రుల మధ్య వైభవంగా జరిగింది. కొందరు క్రికెట్లు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.