ఆరు వేల స్టేషన్‌లలో ఉచిత వైఫై

-

డిజిటల్‌ ఇండియాలో భాగంగా భారతీయ రైల్వే మరో ఘనతను సాధించింది. దేశంలోని ఆరు వేల రైల్వే స్టేషన్‌లలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఝార్ఖండ్‌లోని హజీర్‌బాగ్‌ స్టేషన్‌లో శనివారం ఉచిత వైఫై సేవలను ప్రారంభించడం ద్వారా భారతీయ రైల్వే ఈ మైలురాయిని అందుకుంది.

ఇంటర్నెట్ సేవలను రైల్వే ప్రయాణికులను మరింత చేరువ చేయాలని భావించిన ఇండియన్ రైల్వే రైల్వే స్టేషన్‌లలో ఉచిత వైఫై సేవలను ప్రారంభించింది. రైల్వే శాఖకు చెందిన రైల్‌టెల్‌… గూగుల్‌, డీవోటీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, టాటా ట్రస్ట్‌ సహకారంతో వీటిని ఉచితంగా ఏర్పాటు చేస్తోంది. 2016లో తొలిసారిగా ముంబయి రైల్వేస్టేషన్‌లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అనంతరం క్రమంగా దేశంలోని ప్రధాన స్టేషన్లకు ఈ సేవలను విస్తరించారు. ఉచిత వైఫై అందుబాటులోకి వచ్చిన 5000వ స్టేషన్‌గా పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌ స్టేషన్‌ నిలిచింది. పట్టణ, గ్రామీణ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలకు ఈ సేవలు అందించడమే తమ లక్ష్యమని భారతీయ రైల్వే తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news