హిందువులు భగవంతుడిని మాత్రమే కాకుండా వివిధ రకాల చెట్లను కూడా పూజిస్తారు. ఉదాహరణకి తులసి మొక్క, అరటి చెట్టు, రావి చెట్టు మొదలైనవి వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే అరటి చెట్టు అంటే విష్ణు మూర్తికి చాలా ఇష్టం. చాలా మంది అరటి చెట్టు దగ్గర కూర్చుని ఉపవాసం చేసి పూజ చేసి దీపం వెలిగిస్తారు.
అరటి చెట్టును పూజించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం అరటి చెట్టును పూజించడం వల్ల విష్ణు మూర్తి అనుగ్రహం పొందవచ్చు అని అంటారు. ముఖ్యంగా గురువారం నాడు పూజ చేయడం మరింత మంచిది.
మీ ఇంట్లో కనక ఆర్థిక ఇబ్బందులు, గొడవలు, అశాంతి లాంటివి ఏమైనా ఉంటే అరటి చెట్టు దగ్గర పూజ చేసి దీపం వెలిగించి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టడం వల్ల సుఖశాంతులు కలుగుతాయని ఆరోగ్యం బాగుంటుందని, ఆనందంగా ఉండొచ్చు అని పండితులు చెప్తున్నారు.
ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత అరటి చెట్టును పూజించడం వల్ల లాభాలు పొందొచ్చు. అరటి చెట్టుకు పూజించిన తర్వాత బెల్లం నైవేద్యం పెడితే శుభ ఫలితం కలుగుతుందని పండితులు అంటున్నారు. కాబట్టి ఈ సమస్యలతో సతమతమయ్యే వాళ్ళు ఈ విధంగా అనుసరించడం మంచిది ఇది ఎంతో మంచి ఫలితాలు కనబడతాయి.