2050 నాటికి భారత్‌లో వృద్ధుల జనాభా రెట్టింపు : యూఎన్‌ఎఫ్‌పీఏ

-

2050నాటికి భారత్‌లో వృద్ధ జనాభా రెట్టింపు అవనుందని ఐక్యరాజ్య సమితి జనాభా కార్యకలాపాల నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ) తెలిపింది. వృద్ధాప్యంలో మహిళలు ఒంటరితనం, పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. వీరికోసం మహిళల ఆరోగ్య సంరక్షణ, గృహాలు, పెన్షన్‌ వంటి పథకాలపై ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించాల్సిన అవసరం వస్తుందని అభ్రిపాయపడింది.

2050 నాటికి 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య దేశంలో 346 మిలియన్లకు చేరుతుందని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వూలో యూఎన్‌ఎఫ్‌పీఏ భారత అధ్యక్షురాలు ఆండ్రియా వోజ్నార్‌ తెలిపారు. 2050 నాటికి దేశంలో 50శాతం పట్టణాలు ఉంటాయని అంచనా వేసిన ఆమె.. దీంతో మురికివాడల పెరుగుదల, వాయు కాలుష్యం, పర్యావరణ సమస్యలను తీర్చడానికి భారత్‌ స్మార్ట్‌ సిటీలు, మౌలిక సదుపాయాలు, గృహాలను నిర్మించడం చాలా కీలకమని చెప్పారు. వాతావరణ మార్పులు మహిళల పునరుత్పత్తి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని .. దేశంలో 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 252 మిలియన్ల మంది ఉన్నారని ఆండ్రియా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news