త్రివిధ దళాల ఆధ్వర్యంలో నేడు యోగా డే వేడుకలు

-

దేశవ్యాప్తంగా నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. భారతీయుల జీవితంలో యోగాకు ఎంత ప్రాధాన్యత ఉందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు త్రివిధ దళాలు సన్నద్ధమయ్యాయి. గ్లోబల్‌ ఓషన్‌ రింగ్‌ నినాదంతో నౌకా దళం.. యోగా దినోత్సవాన్ని నిర్వహించనుంది. 3 వేల 500 మంది సిబ్బందితో 19 నౌకలు, 35 వేల కిలో మీటర్లు ప్రయాణించి.. సరిహద్దు దేశాలకు శాంతి, సామరస్య సందేశాన్ని వినిపిస్తాయని భారత నౌకా దళం ప్రకటించింది.

భారత జలాంతర్గామి వగీర్‌ ఇప్పటికే శ్రీలంకలోని కొలంబో తీరానికి చేరుకుంది. కొలంబో పోర్ట్‌లో ఇవాళ భారత-శ్రీలంక నౌకా దళాల ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. భారతమాల పేరుతో ఆర్మీ కూడా..యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. సరిహద్దుల్లో 106 ప్రాంతాల్లో యోగా డే జరుపుతామని ఆర్మీ ప్రకటించింది. సూర్యుడి తొలి కిరణాలు పడే ప్రదేశం నుంచి అత్యంత ఎత్తైన సియాచిన్‌ గ్లేసియర్స్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోనూ యోగా దినోత్సవం నిర్వహిస్తామని వివరించింది. వైమానిక దళం కూడా యోగా డేను ఘనంగా జరిపేందుకు సిద్ధమైన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version