ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్ లో భారత్ 2022 పరుగులు చేసి మరీ ఓటమిపాలైంది. భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. ఆఖరి ఓవర్లలో బౌలింగ్ చాలా ఆందోళనకరంగా ఉందని అభిప్రాయపడ్డారు. రన్స్ ధారాళంగా ఇవ్వడాన్ని అటు ఉంచితే వారు వేయాలనుకున్న లెంగ్త్ లో బంతిని విసరలేకపోతున్నారని విశ్లేషించారు. ముందు ముందు ఇంకా చాలా కష్టించాల్సి ఉంటుందని పఠాన్ సూచించారు.
కాగా, టీమిండియా బ్యాటర్లలో… రుద్దురాజు గైక్వాడ్ 123 పరుగులు చేసి రాణించాడు. టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ రాణించకపోయినా… టీమిండియా కు భారీ స్కోర్ అందించాడు రుతురాజు గైక్వాడ్. అయితే 223 పరుగుల భారీ లక్ష్యంతో… చేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు మొదట తడబడింది. కానీ ఆ తర్వాత విజృంభించి ఆడింది. ఈ నేపథ్యంలోని నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయం సాధించింది.