మా వద్ద చంద్రుడి అద్భుత ఫొటోలున్నాయి.. త్వరలో షేర్ చేస్తాం : ఇస్రో ఛైర్మన్

-

తమ వద్ద చంద్రుడి అద్భుతమైన ఫొటోలు ఉన్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. చంద్రుడికి సంబంధించి ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశం తీయని ఫొటోలు ఉన్నాయని అవి తమ కంప్యూటర్‌ కేంద్రానికి వెళుతున్నాయని చెప్పారు. అక్కడ శాస్త్రవేత్తలు వాటిని ప్రాసెస్‌ చేసిన తర్వాత వీలైనంత త్వరగా ఆ ఫొటోలను విడుదల చేస్తామని వెల్లడించారు. జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ రోవర్‌, విక్రమ్‌ ల్యాండర్‌ సమర్థంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

కొన్ని పరిశోధనల్లో భాగంగా రోవర్‌ కచ్చితంగా వేర్వేరు ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని సోమనాథ్ తెలిపారు. రాబోయే 10 రోజుల్లో ల్యాండర్‌, రోవర్‌లు అన్ని పరిశోధనలను పూర్తి చేస్తాయని వెల్లడించారు. విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన చోటుకు ‘శివ్‌శక్తి’ అనే పేరును ప్రధాని మోదీ పెట్టడాన్ని సోమనాథ్‌ సమర్థించారు. శివ్‌శక్తి, తిరంగా (చంద్రయాన్‌-2 కూలిన ప్రదేశానికి పెట్టిన పేరు) రెండు పేర్లూ భారతీయతకు చిహ్నమని సోమనాథ్ అభిప్రాయ పడ్డారు. చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాల వద్దకు వ్యోమనౌకలను పంపే సత్తా భారత్‌కు ఉందని సోమనాథ్‌ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version