చందమామపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో చంద్రయాన్-3 మిషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన చంద్రయాన్-3 ఒక్కో దశ దాటుతూ సక్సెస్‌ఫుల్‌గా జాబిల్లి వద్దకు చేరుకుంటోంది. తాజాగా చంద్రయాన్-3 ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అవాయిడెన్స్ కెమెరా (LHDAC) తీసిన జాబిల్లి చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. ఆగస్టు 19వ తేదీన తీసిన ఈ చంద్రుని చిత్రాలను ఇస్రో.. ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేసింది.
బండరాళ్లు లేదా లోతైన గుంతలు లేకుండా సురక్షితమైన ల్యాండింగ్ ప్రాంతాన్ని గుర్తించడంలో ఈ కెమెరా సహాయపడుతుందని ఇస్రో పేర్కొంది. మరోవైపు ఈనెల 23వ తేదీన చంద్రుని దక్షిణ ధ్రువంపై ‘విక్రమ్’ సాఫ్ట్ ల్యాండింగ్‌కు ఇస్రో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. సాఫ్ట్ ల్యాండింగ్ సమయాన్ని ముందు 23వ తేదీ సాయంత్రం 5.45నిమిషాలకు నిర్ణయించిన ఇస్రో… తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6.04 నిమిషాలకు మార్చింది. చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించే విధంగా దేశవ్యాప్తంగా లైవ్ ఇచ్చేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది.
Chandrayaan-3 Mission:
Here are the images of
Lunar far side area
captured by the
Lander Hazard Detection and Avoidance Camera (LHDAC).This camera that assists in locating a safe landing area — without boulders or deep trenches — during the descent is developed at… pic.twitter.com/hw2ML4xCY5
— ISRO (@isro) August 21, 2023