నేడే నింగిలోకి ఆదిత్య L1.. సూర్యుడి గుట్టు విప్పేందుకే..

-

చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుపెట్టి చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు సూర్యుడి గుట్టు విప్పేందుకు సిద్ధం అయింది. సౌర వాతావరణం పై పరిశోధనే లక్ష్యంగా ఇస్రో తొలిసారిగా చేపడుతోన్న ఆదిత్య ఎల్‌ 1 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఈ ప్రయోగానికి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.

23 గంటల 40 నిమిషాల కౌంట్‌డౌన్‌ అనంతరం ఇవాళ ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఆదిత్య-ఎల్‌ 1 ఉపగ్రహాన్ని మోసుకుని PSLV-C57 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్‌ ఇదే కావడం విశేషం.

తొలుత ఆదిత్య ఎల్‌-1ను భూమధ్యంతర కక్ష్యలో ప్రవేశపెడతామని ఇస్రో అధికారులు తెలిపారు. భూమి నుంచి సూర్యుని దిశగా 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్‌ పాయింట్ 1కు చేరుకునేందుకు దీనికి 125 రోజుల సమయం పట్టనుందని చెప్పారు.. లగ్రాంజ్‌ పాయింట్‌ వద్ద సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుందని.. అక్కడ ఎక్కువ కాలం సూర్యుడిపై పరిశోధనలు చేయవచ్చని.. గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుందనీ వెల్లడించారు..

Read more RELATED
Recommended to you

Latest news