ఈ ఏడాది తొలి రాకెట్‌ ప్రయోగానికి సిద్దమైన ఇస్రో…!

-

ప్రయోగాలపై మళ్లీ దృష్టి పెట్టింది ఇస్రో. కరోనాతో 9 నెలలు దూరంగా ఉన్న ఇస్రో ఇప్పుడు తన అస్త్రాలకు.. పదును పెడుతోంది. ఈనెల 7న PSLV C-49 ప్రయోగానికి సర్వం సిద్దం చేస్తోంది. ఈ ఏడాది తొలి రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఇప్పటి వరకు వాయిదా పడ్డ ప్రయోగాలను తిరిగి ఉపయోగించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కరోనా తర్వాత చేపట్టనున్న ఈ ప్రయోగంపై ఆసక్తి నెలకొంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రోకి అచ్చొచ్చిన వాహక నౌక PSLV ద్వారా ఈ ప్రయోగం చేపట్టనుంది.

PSLV C-49 ఒక స్వదేశీ ఉపగ్రహంతో పాటు 9 విదేశీ ఉప గ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. ఈవాహక నౌకద్వారా మన దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం, ఎక్స్‌ అబ్జర్వేషన్‌ శాట్‌లైట్‌-1లతో పాటు మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలను ఇస్రో రోదసిలోకి పంపనుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 7న మధ్యాహ్నం 3:02 గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించిన అన్నీ పరీక్షలు పూర్తయ్యాయి. ఈరాకెట్ లో రెండు స్ట్రాపాస్ బూస్టర్లు కలిగిన డిఎల్ తరహా రాకెట్స్ వాడనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news