సీనియర్ సిటిజన్స్‌కు TDS మినహాయింపు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అప్‌డేటెడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ నమోదుకు సమయం 4 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. మధ్య తరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు నిర్మలా సీతారామన్. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు నిర్మలా సీతారామన్.
రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా అవుతుంది. ఇతర పన్ను శ్లాబ్స్‌లో కూడా మార్పులు చేయనున్నారు. దీంతో మధ్య తరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ దక్కింది. బీహార్ లోని పాట్నా ఐఐటీ విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. విద్యారంగంలో AI వినియోగించనున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులు తీసుకురానున్నారు. ప్రభుత్వ స్కూళ్లకు బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందించనున్నట్లు ప్రకటించారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందించనున్నారు. 50 ఏళ్ల వరకూ వడ్డీ రహిత రుణాలు ఇవ్వనున్నారు.