వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు.అంతేకాకుండా పన్ను చెల్లింపు దారులకు త్వరలోనే శుభవార్త చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
వచ్చేవారం పార్లమెంట్ ముందుకు కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లును తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రకటించారు. ప్రస్తుతం ఇన్‌కమ్ ట్యాక్స్‌లో ఉన్న అనవసర సెక్షన్లు తొలగించనున్నట్లు స్పష్టంచేశారు. అంతేకాకుండా, స్వయం సహాయక గ్రూపులకు గ్రామీణ్ క్రెడిట్ కార్డులు అందజేస్తామన్నారు. ఆరు లైఫ్ సేవింగ్ మెడిసిన్స్‌పై పన్నులను తగ్గించబోతున్నట్లు ప్రకటించారు.