అన్నాడీఎంకే 53వ వార్షికోత్సవం సందర్భంగా AIADMK అధికారిక నాయకత్వానికి, సభ్యులకు, మద్దతు దారులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా అక్టోబర్ 17, 1972లో ఎం.జీ. రామచంద్రన్ ద్వారా పార్టీ స్థాపించబడింది. శరవేగంగా బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది. MGR నేను అత్యంత గౌరవంగా భావించే నాయకుడు. పేదలెవ్వరూ ఆకలితో ఉండకూడదని.. ప్రతీ వ్యక్తికి గౌరవంగా జీవించే హక్కు ఉందని భరోసా ఇచ్చారు.
“ఎంజీఆర్‌ను వేరుగా ఉంచేది ఆయన దూర దృష్టిగల పాలన. సంక్షేమాన్ని అభివృద్ధితో సమతుల్యం చేయాలనే అతని నమ్మకం తమిళనాడును దేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రాలలో ఒకటిగా మార్చింది. MGR నాయకత్వం కేవలం తక్షణ అవసరాలను తీర్చడం మాత్రమే కాదు. స్థిరమైన పురోగతికి బలమైన పునాది వేయడం. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి రెండింటికీ ఆయన నిబద్ధత శాశ్వత వారసత్వంగా మిగిలిపోయింది. ఇది వ్యక్తిగతంగా నాకు స్ఫూర్తినిస్తూనే ఉంది. అలాగే MGR ఆశయాలను జయలలిత కొనసాగించారు. అమ్మగా ప్రజల్లో శాశ్వతమైన గౌరవాన్ని పొందింది” అంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.