కల్తీ మద్యం సేవించి ఇటీవలి కాలంలో చాలా మంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. కొందరైతే ఏకంగా తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా బిహార్ రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కల్తీ మద్యం సేవించిన పలువురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇప్పటికే 20 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం.
రాష్ట్రంలోని శివన్ ప్రాంతంలో కల్తీ మద్యం సేవించడం వల్లే మృతుల సంఖ్య భారీగా పెరిగిందని ఎస్పీ అమితేశ్ కుమార్ తెలిపారు. బుధవారం రాత్రి నలుగురు చనిపోవడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురిని పట్నా, 15 మందిని సివిల్ హాస్పిటల్‌కు తరలించారు.చికిత్స పొందుతూ పలువురు మృతి చెందారు. కల్తీ మద్యాన్ని అడ్డులేకపోవడంతో భగవాన్ పూర్ ఎస్‌హెచ్వో, ప్రొహిబిషన్ ఏఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.