జపాన్‌కు చెందిన టెక్ జపాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ నౌటకా నిషియామా నెల రోజులుగా భారత్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలను ఆయన సందర్శించారు. భారతీయ సంస్కృతిని అర్థం చేసుకునేందుకు బెంగళూరుకు మకాం మార్చిన ఆయన స్థానిక సంస్కృతిని తెలుసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో తాను తెలుసుకున్న విషయాలను ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డిన్ వేదికగా షేర్ చేశారు. ప్రపంచానికి భారతీయ నాయకత్వం అవసరమని నిషియామా అభిప్రాయపడ్డారు. భారతీయ వైవిధ్యం, విలువలను చూసి తాను ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు . నెల కిందటే తాను భారత్‌కు వచ్చానని.. వివిధ మతాలు, జాతులు ఉన్నప్పటికీ భారత్ ఒకే దేశంగా ఉండటం నిజంగా అద్భుతం అని కొడియారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. నాయకత్వం గురించి ఆలోచించడానికి ఇదే సరైన అవకాశం అంటూ రాసుకొచ్చారు.
భారతీయులకు ప్రపంచ అగ్రగామి సంస్థల్లో నాయకత్వం వహించే సామర్థ్యం ఉందన్న నిషియామా.. భారతీయ నాయకత్వం నుంచి తాను నేర్చుకున్న విషయాన్ని తన సంస్థ నిర్వహణలో వర్తింపజేస్తానని పోస్టులో పేర్కొన్నారు.