పార్థసారథికి బిగ్‌ షాక్‌…నూజివీడు టీడీపీలో కరపత్రాల కలకలం !

-

ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీలో కలకలం నెలకొంది. నూజివీడు టీడీపీ అభ్యర్ధి పార్థసారథిపై భూ బకాసురుడు అంటూ కరపత్రాలు కలకలం రేపాయి. నూజివీడు నియోజక వర్గంలో ప్రధాన కేంద్రాల్లో ప్రత్యక్షమైన కరపత్రాలతో టీడీపీ వర్గం ఆందోళనకు దిగింది. వైసీపీ వర్గం పనే అని టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Big shock for Parthasarathi

భూ బకాసురుడు సారధి అంటూ గ్రామాల్లో తెల్లవారేసరికి కరపత్రాలు ప్రత్యక్షం అయ్యాయి. నూజివీడు టీడీపీ అభ్యర్ధి పార్థసారథి చేసిన అక్రమాలు అంటూ పోస్టర్లు ప్రింటింగ్ చేశారు. నీ అక్రమాలు పెనమలూరులో పాలు తాగే పిల్లాడైనా చెబుతాడు అంటూ కరపత్రాలు ముద్రణ చేశారు. దీంతో నూజివీడు టీడీపీ అభ్యర్ధి పార్థసారథి కంగు తిన్నారు. అయితే.. ఈ అంశంపై నూజివీడు టీడీపీ అభ్యర్ధి పార్థసారథి ఎక్కడా కూడా ఇంకా ఫిర్యాదు చేయలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version