వేరు కాపురానికి భార్య ఒత్తిడి చేయడం సరికాదని ఝార్ఖండ్ హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా ఝార్ఖండ్ హైకోర్టు కీలక వాక్యాలు చేసింది. భర్త కుటుంబంలో భార్య అంతర్భాగంగా ఉండాలని, వేరు కాపురం కోసం ఒత్తిడి చేయడం సరికాదని వాక్యానించింది ఝార్ఖండ్ హై కోర్టు.
విదేశాల్లో పెళ్లి జరగగానే కుమారుడు తన కుటుంబం నుంచి వేరు పడతాడని, మనదేశంలో ఇందుకు విరుద్ధంగా ఉంటుందని పేర్కొంది. బలమైన కారణం ఉంటే తప్ప భర్త కుటుంబంతోనే భార్య ఉండాలని గతంలో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును ఉదహరించింది ఝార్ఖండ్ హై కోర్టు.
కాగా గతంలో వ్యభిచార గృహాల్లో దాడులు జరిపినప్పుడు సెక్స్ వర్కర్లను పోలీసులు అరెస్టు చేయొద్దని ఇదే హైకోర్టు ఆదేశించింది. వారిపై కేసులు కూడా నమోదు చేయొద్దని సూచించింది హైకోర్టు.