గవర్నర్ తమిళి సై బీజేపీ కార్యకర్త అని ఇన్నాళ్లు అనుకున్నానని….కానీ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అధికారికంగా సభ్యత్వం తీసుకుని ఆ పార్టీలో చేరిపోయి అభిమానాన్ని చాటుకోవాలని విమర్శించారు.
ఈరోజు రాజ్ భవన్ నుంచి వచ్చిన ప్రసంగాన్ని ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ను జాకీలు పెట్టి లేపేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన మండిపడ్డారు. అటు శునకాన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టినా బుద్ది మారదంటూ రేవంత్ రెడ్డి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
మంచి ముహూర్తం చూసి శునకాన్ని సీట్లో కూర్చోబెట్టినా బుద్ది మారదని..నేను రేవంత్ గురించి అనవసరంగా మాట్లాడి, నోరు పాడు చేయదల్చుకొలేదని ఫైర్ అయ్యారు. అంత అసహనం ఎందుకు అంటూ రేవంత్ పై ఆగ్రహించారు. మమ్మల్ని అంటున్నారు.అసలు మేము అధికారం లో ఉండి..వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్లు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయంతోనే బీజేపీ, కాంగ్రెస్ బండారం బయట పడిందని చురకలు అంటించారు.