ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలకు రకరకాల పౌడర్లు వాడుతున్నారన్న సంగతి తెలిసిందే. కానీ… ఎప్పటినుంచో జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ ఉంది. చాలామంది ఇప్పటికి కూడా ఈ పౌడర్ వాడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారంటే కచ్చితంగా జాన్సన్ పౌడర్ కనిపిస్తుంది ఇంట్లో. అయితే అలాంటి ప్రఖ్యాత జాన్సన్ అండ్ జాన్సన్, కెన్ యు కంపెనీలకు భారీ షాక్ తగిలింది.
ఈ సంస్థల బేబీ పౌడర్లు వాడటం వల్ల తెరిసా గార్సియా అనే మహిళ క్యాన్సర్ తో బాధపడి మరణించింది అంట. ఈ మేరకు చికాకు కోర్టు అధికారికంగా ప్రకటన చేసింది. ఆమె కుటుంబానికి ఏకంగా 375 కోట్ల పరిహారం చెల్లించాలని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి ఆదేశించింది కోర్టు. అజ్బిస్టాస్ ఎక్స్పోజర్ తో ముడిపడిన క్యాన్సర్ మెసోథెలియోమాతో తెరిసా మరణించింది. దీనికి కెన్ వ్యూ 70% అలాగే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ 30% బాధ్యత వహించాలని చికాగో కోర్టు స్పష్టం చేసింది.