ఐపిఎల్ 224 టోర్నమెంటులో ఆర్సిబికి అస్సలు కలిసి రావడం లేదు. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ ఏడాది అస్సలు కలిసి రావడం లేదు. 8 మ్యాచ్లలో ఒకటి గెలిచి…ఏడు మ్యాచ్లలో ఓడిపోయింది. దీంతో పాయింట్స్ టేబుల్ లో చిట్ట చివరన ఉండిపోయింది. అయితే ఏదైనా జట్టు ప్లే ఆప్స్ కూల్ వెళ్లాలంటే 16 పాయింట్స్ ఉండాలి. ఆర్సిబికి మిగిలిన 6 మ్యాచ్ లు భారీ మార్జిన్లతో గెలిచిన కూడా 14 పాయింట్లు ఉంటాయి.
దీని ప్రకారం ఆ జట్టు సొంతంగా ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం లేదు. మిగతా జట్లపై ఆధారపడాల్సి ఉంటుంది. అవి భారీ తేడాలతో ఓడిపోవడం లేదా మ్యాచ్ లు రద్దు కావడం జరగాలి. అప్పుడైతేనే ఆర్సిబి ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి మూటగట్టుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.