మహిళా న్యాయవాదిపై జడ్జీ వివాదస్పద వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు సీరియస్..!

-

ఒక కేసు విచారణ సందర్భంగా మహిళా న్యాయవాది పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక జడ్జీ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం పై కర్ణాటక హై కోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్థానం నివేదిక కోరింది. ఇటీవలే భూ వ్యవహారానికి సంబంధించిన కేసులో హై కోర్టు జడ్జీ జస్టి వేదవ్యాసచార్ శ్రీశానంద విచారన చేపట్టారు. ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ తో పోల్చుతూ.. వివాదస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఈ కేసును వాదించిన న్యాయవాది పై అభ్యంతర వ్యాక్యలు చేశారు.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. కోర్టుల్లో జడ్జీలు చేసే వ్యాఖ్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వ్యక్తం చేసింది. కోర్టు కార్యకలాపాలను పర్యవేక్షించడంలో సోషల్ మీడియా చురుకైన పాత్ర పోషిస్తున్నప్పుడు.. న్యాయస్థానాల వ్యాఖ్యానాలు చట్టాలకు అనుగుణంగా మర్యాదపూర్వకంగా ఉండేవిధంగా చూడాల్సిన అవసరం ఉందని ధర్మానసం పేర్కొంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version