Asian Games 2023 : ఏపీకి చెందిన మహిళ క్రేజీ రికార్డు.. ఆర్చరీలో మరో స్వర్ణం

-

చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఏపీకి చెందిన మహిళ ఆర్చర్ జ్యోతి వెన్నం అదరగొట్టారు. ఇవాళ జరిగిన కాంపౌండ్ ఇండివిడ్యువల్ ఫైనల్ లో గోల్డ్ మెడల్స్ సాధించారు. 149-145తో దక్షిణ కొరియాకు చెందిన సోచే-విన్ పై విజయకేతనం ఎగురవేశారు. మొత్తంగా ఈ ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణ పథకాలు జ్యోతి ఖాతాలోకి చేరాయి. కాంపౌండ్ ఇండివిడ్యువల్, కాంపౌండ్ ఉమెన్ టీం, కాంపౌండ్ మిక్స్డ్ టీం విభాగాల్లో ఆమె మెడల్స్ సాధించారు.

Jyothi Surekha Vennam wins gold medal
Jyothi Surekha Vennam wins gold medal

ఇది ఇలా ఉండగా, చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఇవాళ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఫైనల్ లో స్వర్ణ పథకం కోసం భారత్, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడనున్నాయి. జోరు మీదున్న భారత యువ ఆటగాళ్లు గోల్డ్ మెడల్ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక ఆసియా క్రీడల్లో తొలిసారి ఫైనల్ చేరిన ఆఫ్గాన్ జట్టు కూడా స్వర్ణం గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ ఇవాళ ఉదయం 11:30 కి ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news