విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా ఈనెల 28న సాయంత్రం 6 గంటల నుండి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 29న తెల్లవారుజామున 3:30 గంటలకి ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ, అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజలు ఆర్చకులు పూర్తి చేస్తారు.

ఉదయం తొమ్మిది గంటల తర్వాత భక్తులకు అనుమతిస్తారు. కాగా, తిరుమలలోనూ 28న రాత్రి 7.05 నుంచి తెల్లవారుజామున 3:15 వరకు ఆలయాన్ని మూసేస్తారు. ఇది ఇలా ఉండగా..తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ షాక్ ఇచ్చింది టీటీడీ పాలక మండలి. తిరుపతిలో ఇవాళ్టి నుంచే దర్శనం టోకెన్లు బంద్ చేయనుంది టీటీడీ పాలక మండలి. తిరుమలలో భక్తుల రద్ది దృష్యా ఇవాళ, రేపు,13,14,15వ తేదిలలో తిరుపతిలో జారి చేసే సర్వదర్శన టోకేన్లు రద్దు చేసింది టిటిడి. ఇక అటు తిరుమలలో 14వ తేదిన నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.