విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో వచ్చే ఎన్నికల్లో ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ నుంచి పోటీకి సిద్ధమయ్యాడు నటుడు విజయ్. ఎలాంటి అనుభవం లేకుండా కొందరు రాజకీయాల్లోకి వస్తున్నారని పరోక్షంగా విమర్శలు చేశారు కనిమొళి. రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేని కొందరు పేదలు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో వస్తారని వ్యాఖ్యలు చేశారు కనిమొళి.

తమిళనాడు ప్రజల తరఫున పోరాడాలనుకుంటే ముందు వారి అవసరాల గురించి, రాజకీయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని హితవు పలికారు. ఎట్టాయపురంలో నిర్వహించిన డీఎంకే పార్టీ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎంపీ కనిమొళి… విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.