ఏపీ కేబినెట్ మీటింగ్..ముగిసింది. ఈ సందర్బంగా 12 అంశాలపై చర్చించింది ఏపీ మంత్రివర్గం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ చూస్తోందని ప్రస్తావించారు మంత్రి పయ్యావుల కేశవ్. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతినేలా వివిధ సంస్థలకు ఈ మెయిల్స్ పెట్టడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ కుట్రలపై విచారణ చేయిస్తామని పేర్కొన్నారు చంద్రబాబు. ధాన్యం కొనుగోళ్ల పాత బకాయిలు విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. 50వ CRDA సమావేశం నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్. రాజధాని మలివిడతలో 34,964 ఎకరాల భూసేకరణకు ఆమోదం తెలిపింది. 13 గ్రామాల పరిధిలో భూసేకరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.