ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. ఇవాళ చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం లో వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మామిడి రైతులను కలిసేందుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వైసిపి కార్యకర్తలు అలాగే జనాలు విపరీతంగా వచ్చారు. 500 మందికి మించకుండా రావాలంటే పోలీసుల మాటలను… వైసిపి నేతలు పట్టించుకోలేదు.

విపరీతంగా జనాలు రావడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి చుట్టూ జనాలు గుమి గూడారు. జగన్మోహన్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కొంతమంది ప్రయత్నం చేశారు. ఈ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డిని కొంతమంది తోసేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అంతకుముందు వైసీపీ కార్యకర్తపై పోలీసులు దాడి చేశారు. దీంతో వైసిపి కార్యకర్తకు తీవ్ర గాయాలు కూడా అయిన ఫోటోలు బయటకు వచ్చాయి.
Security lapse by AP Govt pic.twitter.com/3IuzjaZf6Q
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) July 9, 2025